Share News

నిషేధిత గుట్కా విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:06 AM

పాఠశాల, కళాశాలలు ఉన్న ప్రాంతాలకు వంద మీటర్ల దూరంలోనే పొగాకు సంబంధిత ఉత్పత్తులు విక్రయించాలని ఏసీపీ కె. దామోదర్‌ ఆదేశించారు.

నిషేధిత గుట్కా విక్రయిస్తే చర్యలు

నిషేధిత గుట్కా విక్రయిస్తే చర్యలు

ఏసీపీ దామోదర్‌

బెంజిసర్కిల్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పాఠశాల, కళాశాలలు ఉన్న ప్రాంతాలకు వంద మీటర్ల దూరంలోనే పొగాకు సంబంధిత ఉత్పత్తులు విక్రయించాలని ఏసీపీ కె. దామోదర్‌ ఆదేశించారు. మంగళవారం ఎన్‌ఎస్‌ఎం పాఠశాల ప్రాంతాల్లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత గుట్కా విక్రయించిన పలువురిపై కేసులు నమోదు చేయాలని ఏసీపీ సూచించారు. పలువురు ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల సమీపంలో పొగాకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయిస్తున్న ఏడు షాపులకు రూ.200 జరిమానా విధించామని, ఆయా ఉత్పత్తులను విక్రయించవద్దని హెచ్చరించినట్లు తెలిపారు. మాచవరం, గుణదల పరిధిలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలకు సమీపంలో నిషేధిత గుట్కా, పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌ఎస్‌ఎం రోడ్డులో డ్రోన్లతో పర్యవేక్షించారు. మైక్‌లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో పటమట సీఐ వల్లభనేని పవన్‌ కిషోర్‌, ఎస్‌ఐలు జి.రేవతి, హరికృష్ణ, దుర్గాదేవి పటమట స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:06 AM