Share News

బుల్లెట్‌ను ఢీకొన్న లారీ..యువకుడి దుర్మరణం

ABN , Publish Date - May 04 , 2025 | 01:09 AM

జగ్గయ్యపేట- చిల్లకల్లు రోడ్డులో బుల్లెట్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరొ క యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

బుల్లెట్‌ను ఢీకొన్న లారీ..యువకుడి దుర్మరణం

మరొక యువకుడికి తీవ్రగాయాలు

జగ్గయ్యపేట, మే 3(ఆంధ్రజ్యోతి): జగ్గయ్యపేట- చిల్లకల్లు రోడ్డులో బుల్లెట్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరొ క యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. జగ్గయ్యపేట ఎస్సై-2 వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..జగ్గయ్యపేట చెరువు బజార్‌కు చెందిన దేవరకొండ సాయి (22) నందిగామలో ఒక ఫంక్షన్‌కు హాజరై తిరి గి తన స్నేహితుడు తమ్మిశెట్టి వాసు(21) తో కలిసి బుల్లెట్‌పై జగ్గయ్యపేటకు బయలుదేరా డు. చిల్లకల్లు దాటాక శుభమస్తు ఫంక్షన్‌హాలు, బేతెస్థ గార్డెన్స్‌ సమీపంలో లారీ యూటర్న్‌ తిరుగుతూ బుల్లెట్‌ను ఢీకొట్టింది. బుల్లెట్‌పై ఉన్న సాయి తలకు, దేహానికి తీవ్రగాయాలు కావటం, రోడ్డు దెబ్బ తగలడంతో అక్కడికక్కడే రక్త పు మడుగులో పడి మృతి చెందాడు. వాసు కాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో జగ్గయ్యపేట రౌండ్స్‌కు వస్తున్న పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్‌ జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కో సం విజయవాడకు తరలించారు. శనివారం ప్రభుత్వాస్పత్రిలో సాయి భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడు సాయి తండ్రి నాగేశ్వరరావు ప్రముఖ ఆర్‌ఎంపీ వైద్యుడు. తల లో నాలుకలో ఉండే నాగేశ్వరరావు కుమారుడు చనిపోవటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయి భౌతికకాయానికి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, యువనేత శ్రీరాం చినబాబు నివాళులర్పించారు. నాగేశ్వరరావును పరామర్శించి వారు ధైర్యం చెప్పారు.

Updated Date - May 04 , 2025 | 01:09 AM