ఎస్పీకి సమస్యల ఏకరువు
ABN , Publish Date - May 27 , 2025 | 12:48 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఎస్పీ ఆర్.గంగాధరరావు ముందు పలువురు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
మచిలీపట్నం టౌన్, మే 26(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఎస్పీ ఆర్.గంగాధరరావు ముందు పలువురు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
తన భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడని, ఆస్తిని కుమారుడు, కుమార్తెకు ఇచ్చివేశారని, ఇంటి నుంచి కుమారుడు గెంటివేశాడని మచిలీపట్నం గిలకలదిండికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తన పొలం సరిహద్దుదారుడు పొలంలోకి వెళ్లకుండా అడ్డు తగులుతున్నాడని, అదేమిటని అడిగితే దాడికి దిగుతున్నాడని పమిడిముక్కలకు చెందిన కుమార్ అనే రైతు ఫిర్యాదు చేశారు.
అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని అమ్ములు అనే వివాహిత తన గోడు వినిపించుకుంది.
తనకు వివాహమై ఏడేళ్లయిందని, రెండేళ్ల నుంచి తన భర్త చెడు వ్యసనాలకు లోనై పుట్టింటికి పంపించేశాడని వడ్లమన్నాడుకు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది.