Share News

పెరుగుతున్న వరద

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:57 AM

ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతోంది. శనివారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇన్‌ఫ్లో పెరిగింది. బ్యారేజీకి 3,93,000 క్యూసెక్కుల నీరు వస్తోంది.

పెరుగుతున్న వరద
శనివారం రాత్రి ఘాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

భక్తుల భద్రత కోసం పటిష్ట ఏర్పాట్లు

స్నానఘాట్లలో రెండంచెల బారికేడ్లు

విజయవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతోంది. శనివారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇన్‌ఫ్లో పెరిగింది. బ్యారేజీకి 3,93,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజీ 69 గేట్లను పూర్తిస్థాయిలోకి ఎత్తి 3.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టా పరిధిలోని కాల్వలకు 8,836 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

భక్తులు నదిలోకి దిగొద్దు : కలెక్టర్‌ లక్ష్మీశ

ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దసరా ఉత్సవాలకు వచ్చే భక్తుల భద్రతకు పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. శనివారం రాత్రి ఆయన దుర్గాఘాట్‌, భవానీ ఘాట్‌, సీతమ్మ వారి పాదాలు తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు సూచనలు చేశారు. భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన అదనపు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఘాట్లలో రెండంచెల బారికేడింగ్‌ ఏర్పాట్లు చేశామని, జల్లుస్నానాలు చేసేందుకు అన్ని వసతులతో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సూచనలను పాటించాలని, వరదనీటిలో దిగే సాహసం చేయొద్దని సూచించారు.

Updated Date - Sep 28 , 2025 | 12:57 AM