Share News

కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ

ABN , Publish Date - May 19 , 2025 | 12:28 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు.

కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ
కంకిపాడు-గొడవర్రు-రొయ్యూరు ప్రధాన రహదారి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, జనసేన నాయకులు

కంకిపాడు, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహకారంతో రూ.3.75 కోట్లతో నిర్మించిన కంకిపాడు-గొడవర్రు-రొయ్యూరు ప్రధాన రహదారిని ఆదివారం ఆయన ప్రారంభించారు. 2019-24 మధ్య రాష్ట్ర రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉం దన్నారు. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్లూ దాచుకోవడం, దోచుకోవడం మినహా అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంతర్గత రహదారులతో పాటు ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి చూపించామన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉండాలని కోరారు. పంచాయతీరాజ్‌ డీఈ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కోనేరు భాను, యార్లగడ్డ బోసు, రవీంద్ర, అనుమోలు ప్రభాకర్‌ భాస్కరరావు, కోనేరు రాజేష్‌, పులి శ్రీనివాసరావు, జనసేన నాయకులు పులి కామేశ్వరరావు, ముప్పా రాజా, ఏసుపాదం, మేదండ్రావు సతీష్‌, బీజేపీ నాయకులు గుల్లపల్లి శ్రీనివాసరావు, దివి రోహిణి పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:28 AM