Share News

కారు బీభత్సం

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:10 AM

స్థానిక చెరువు బజార్‌లోని కొత్త రైతుబజార్‌ వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. భవన నిర్మాణ కార్మికుల అడ్డాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అనంతరం ఇనుప స్తంభాన్ని ఢీకొని ఆగిపోవటంతో ఐదారుగురు కార్మికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

కారు బీభత్సం
కారు ప్రమాద సీసీ ఫుటేజీ దృశ్యం

జగ్గయ్యపేటలో ఒక్కసారిగా కూలీలపైకి దూసుకొచ్చిన కారు

ఐదుగురు కార్మికులకు గాయాలు

స్తంభాన్ని ఢీకొట్టి ఆగడం వల్ల తప్పిన ప్రమాదం

మద్యం సేవించి కారు నడిపిన డ్రైవర్‌

జగ్గయ్యపేట, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : స్థానిక చెరువు బజార్‌లోని కొత్త రైతుబజార్‌ వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. భవన నిర్మాణ కార్మికుల అడ్డాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అనంతరం ఇనుప స్తంభాన్ని ఢీకొని ఆగిపోవటంతో ఐదారుగురు కార్మికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్తంభాన్ని ఢీకొని ఆగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. చెరువుబజార్‌లో నివాసం ఉంటున్న కారుడ్రైవర్‌ వెంకటేశ్వర్లు మద్యం సేవించి శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కారును వేగంగా నడిపాడు. ముందుగా ఓ బైక్‌ను ఢీకొట్టడంతో కారు వేగం తగ్గి కారు దిశ మారింది. కారు వేగంగా ఉండి ఉంటే.. మఠం రోడ్డులోకి కాకుండా నేరుగా బస్టాండు వైపునకు దూసుకెళ్లి ఉండేది. అక్కడ వందలాది మంది కార్మికులకు ముప్పు వాటిల్లేది. ఈ ఘటనలో ఓర్సు రామకృష్ణ, తాళ్లూరి శ్రీను, బండి నాగరాజు, కుంచపు నాగరాజు, బత్తుల వెంకట గురువులు గాయపడ్డారు. డ్రైవర్‌ పూటుగా మద్యం సేవిస్తాడని, అందుకే భార్యాపిల్లలు అతడిని వదిలి దూరంగా ఉంటున్నారని స్థానికులు చెప్పారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు శ్రీరాం చినబాబు తదితరులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జగ్గయ్యపేట ఎస్సై-2 వెంకటేశ్వరరావు కే సు నమోదుచేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 01:11 AM