Share News

అమ్మో.. అనధికార లే అవుట్లు!

ABN , Publish Date - May 10 , 2025 | 12:41 AM

సుప్రీంకోర్టు ఆదేశాలున్నా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని ఉమ్మడి కృష్ణాజిల్లాలో అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. సీఆర్‌డీఏ విడుదల చేసిన ఈ జాబితాలో ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి 68 అనధికార లే అవుట్లు ఉన్నాయి.

అమ్మో.. అనధికార లే అవుట్లు!

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 68 వరకు గుర్తింపు

అధికారికంగా ప్రకటించిన సీఆర్‌డీఏ అధికారులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సుప్రీంకోర్టు ఆదేశాలున్నా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని ఉమ్మడి కృష్ణాజిల్లాలో అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. సీఆర్‌డీఏ విడుదల చేసిన ఈ జాబితాలో ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి 68 అనధికార లే అవుట్లు ఉన్నాయి. ఇవి సీఆర్‌డీఏ అధికారులు గుర్తించినవే కాగా, గుర్తించనివి 200కు పైగానే ఉంటాయని తెలుస్తోంది. నాన్‌ లే అవుట్లను క్రమబద్దీకరించే ది లేదని సుప్రీం స్పష్టంగా తీర్పునిచ్చినా రాజధాని ప్రాంత పరిధిలో ఇవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. సుప్రీం మార్గదర్శకాలపై అవగాహన లేనివారు భవిష్యత్తులో ఎల్‌పీఎస్‌ ద్వారా క్రమబద్దీకరించుకోవచ్చనే ఆలోచనతో వీటిని కొంటున్నారు. గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయని సమాచారం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ముందు ఇలా నాన్‌ లే అవుట్లలో ప్లాట్లను కొన్నవారు తర్వాత క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వంటి స్కీమ్‌లు వచ్చినపుడు అపరాధ రుసుం చెల్లించి క్రమబద్దీకరించుకునేవారు. కానీ, ఇప్పుడలా లేదు. నాన్‌ లే అవుట్లను క్రమబద్దీకరించే వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది. తక్కువ ధరకు వస్తాయన్న ఉద్దేశంతో ఆశపడి పెద్ద ఎత్తున వీటిని కొంటున్నారు. లే అవుట్లు వేసేవారు కూడా సీఆర్‌డీఏ లే అవుట్‌ అంటూ అబద్ధపు ప్రకటనలు చేస్తూ కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని నూజివీడు జోన్‌లో 29 అక్రమ లే అవుట్లను సీఆర్‌డీఏ గుర్తించగా, మైలవరం, నందిగామలో భారీగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. అలాగే, గన్నవరం జోన్‌ పరిధిలోకి వచ్చే గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల పరిధిలో 16 అక్రమ లే అవుట్లు ఉన్నాయి.

Updated Date - May 10 , 2025 | 12:41 AM