Share News

60 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Jul 02 , 2025 | 11:53 PM

రేషన్‌ అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న ఇరువురిని మాచవరం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

60 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

60 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ఇరువురు అరెస్టు, మరొకరు పరారీ

వాహనం సీజ్‌

గుణదల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న ఇరువురిని మాచవరం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పంరిపల్లి మల్లిఖార్జున, కురిటి దుర్గాప్రసాద్‌లు మొగల్రాజపురం వాటర్‌ట్యాంక్‌ వద్ద మంగళవారం రాత్రి 60 బస్తాల రేషన్‌ బియ్యం వాహనంలో లోడు చేస్తుండగా మాచవరం ఎస్‌ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. బియ్యం బస్తాలపై ఏపీ ప్రభుత్వ లేబుల్‌ ఉండటంతో వాటిని రేషన్‌ బియ్యంగా గుర్తించి స్టేషన్‌కు తరలించారు. బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్‌ చేశారు. వాహనంలో ఉన్న మల్లిఖార్జున, దుర్గా ప్రసాద్‌లను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. రేషన్‌ బియ్యం అందజేసిన మహిళ పరారీలో ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్‌ తెలిపారు.

Updated Date - Jul 02 , 2025 | 11:53 PM