కీర్తి పతాక
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:48 AM
వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం 3,600 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో 3,600 అడుగుల పతాకాన్ని ప్రదర్శించనున్న క్రమంలో మొదటిసారిగా నగరంలో ఈ విశేష కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.
నగరంలో 3,600 అడుగుల జాతీయ పతాక ప్రదర్శన
విద్యాధరపురం, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం 3,600 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో 3,600 అడుగుల పతాకాన్ని ప్రదర్శించనున్న క్రమంలో మొదటిసారిగా నగరంలో ఈ విశేష కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. భవానీపురంలోని చర్చి సెంటర్ నుంచి స్వాతి థియేటర్ వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎరుకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాటి స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో బాలబాలికలు ఈ రన్‌లో పాల్గొన్నారు.