హైదరాబాద్ విహారయాత్రకు 101 మంది విద్యార్థులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:31 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన 101మంది విద్యార్థులను హైదరాబాద్‌కు సైన్స్ విహారయాత్రకు పంపుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు.

హైదరాబాద్ విహారయాత్రకు
101 మంది విద్యార్థులు
విహారయాత్ర
పోస్టర్ ఆవిష్కరణ
లబ్బీపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన 101మంది విద్యార్థులను హైదరాబాద్‌కు సైన్స్ విహారయాత్రకు పంపుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. విహారయాత్ర పోస్టర్‌ను విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు 22మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞాన, విహారయాత్రలో దర్శించే వివిధ జాతీయ స్థాయి సైన్స్ సెంటర్స్, ప్రయోగ, పరిశోధనా కేంద్రాల ద్వారా సృజనాత్మకతను పెంపొందించుకొని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ మైనం హుస్సేన్, సమగ్రశిక్షా ఏఎంవో అశోక్, ఏఎస్‌వో సుధాకర్, పీడీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.