Share News

వైటీసీని తెరిపిస్తాం.. ఉపాధి కల్పిస్తాం

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:35 AM

పశ్చిమ ఏజెన్సీలోని గిరిజన యువతీ యువకులకు ప్రత్యేక శిక్షణలు ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పించే యువత శిక్షణ కేంద్రం (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) మూతపడి ఉండడానికి వీల్లేదని, దానిని తెరిపించి గిరిజన యువతకు ఉపాధిని కల్పిస్తామని ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు తెలిపారు.

వైటీసీని తెరిపిస్తాం.. ఉపాధి కల్పిస్తాం
సమీక్షలో మాట్లాడుతున్న ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం

ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం

బుట్టాయగూడెం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ఏజెన్సీలోని గిరిజన యువతీ యువకులకు ప్రత్యేక శిక్షణలు ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పించే యువత శిక్షణ కేంద్రం (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) మూతపడి ఉండడానికి వీల్లేదని, దానిని తెరిపించి గిరిజన యువతకు ఉపాధిని కల్పిస్తామని ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు తెలిపారు. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయంలో గురువారం అన్ని శాఖల అధికారులతో ఆయనతో పాటు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జేసీ ధాత్రిరెడ్డి సమీక్ష నిర్వహించారు. బొరగం మాట్లాడుతూ వైటీసీని తిరిగి తెరిపించడానికి అవసరమైన నిధుల విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వైటీసీలను నిర్వీర్యం చేసి పాడుబడిన భవనాలుగా మార్చివేయడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ వైసీపీ పాలనలో వైటీసీ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. జేసీ, ఐటీడీఏ పీవో పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తుల అమ్మకాలకు వనసిరి అనే పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. ట్రైకార్‌ ద్వారా గిరిజన యువతకు వాహన యూనిట్లను అందించేం దుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ట్రైకార్‌ డైరెక్టర్‌ జె.కృష్ణారావు, జీసీసీ డైరెక్టర్‌ మడకం కన్నపరాజు, ఏపీవో పీవీఎస్‌ నాయుడు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా పాలకుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జేసీ ధాత్రిరెడ్డి సందర్శించారు. పెన్నులు, పుస్త కాలు పంపిణీ చేశారు. ఐటీడీఏ పీవో ఛాంబర్‌లో గురువా రం జేసీ పి.ధాత్రిరెడ్డి నిర్వహించిన గ్రీవెన్స్‌కు గిరిజనులు, గిరిజనేతరులు వినతులు సమర్పించారు. వీటి పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

Updated Date - Jan 03 , 2025 | 12:35 AM