Kolusu Parthasarathi: ఐదేళ్లలో అర్హులందరికీ గృహాలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:50 AM
గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్రం నిధులు మురిగిపోయాయని తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2,378 కోట్ల హౌసింగ్ నిధులు మురిగిపోయాయి
పాత తప్పిదాలను సరిదిద్దుతాం
గృహ నిర్మాణ మంత్రి పార్థసారథి
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఐదేళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవానికీ శాశ్వత గృహ వసతి కల్పించాలనే దృఢ నిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్రం నిధులు మురిగిపోయాయని తెలిపారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు రూ. 3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అని మంత్రి విమర్శించారు. నిరుపేదలందరికీ శాశ్వత గృహ వసతి, కల్పించడంలో విఫలమైన గత ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణాలపై కేంద్రం రూ.20,726 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడమే కాకుం డా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయన్నారు. పీఎంవై గ్రామీణ్ కేంద్ర పోర్టల్ నుంచి 1,39,243 మంది లబ్ధిదారులను తొలగించి వారికి అన్యాయం చేశారన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవానికీ శాశ్వత గృహ వసతి కల్పిస్తామని మంత్రి తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News