ఢిల్లీకి కొల్లేరు సమస్య
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:31 AM
కొల్లేరు లో జిరాయితీ, సొసైటీ భూములను తిరిగి ప్రజలకు ఇప్పించేలా న్యాయపోరాటం చేస్తామని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు కొల్లేరు పంచాయితీ ఢిల్లీకి చేరింది.
ఎంపీ పుట్టా మహేశ్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం
సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమైన కొల్లేరు పరిరక్షణ సంఘం
కైకలూరు/ఏలూరు టూటౌన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : కొల్లేరు లో జిరాయితీ, సొసైటీ భూములను తిరిగి ప్రజలకు ఇప్పించేలా న్యాయపోరాటం చేస్తామని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు కొల్లేరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొల్లేరులో అక్రమ చెరువులపై గతంలో సుప్రీంకోర్టులో మృత్యుంజయరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కొల్లేరులో ఇటీవల అటవీశాఖ అధికారులు ఆక్రమ ణలను తొలగించారు. సొసైటీ, జిరాయితీ భూములను కాంటూరు సరి హద్దులను దాటి ధ్వంసం చేశారు. దీనిపై గతనెల 25న కైకలూరులో కొల్లేరు ప్రజల ఐక్యత సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ సుప్రీంకోర్టులో పోరాటం చేసేందుకు జిల్లా కొల్లేరు సంఘ నాయకులతో కలిసి మంగళవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగేశ్వరరెడ్డిని కలిశారు. కొల్లేరు ప్రాంతంలో ధ్వంసం చేసిన 15 వేల ఎకరాల జిరాయితీ భూములు వెనక్కి ఇవ్వ డంపై రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సర్వే నెంబర్ల ఆధారంగా కాం టూరు సరిహద్దు నిర్ణయించకుండా 77వేల ఎకరాల్లో ఇష్టానుసరంగా చేపట్టిన విధ్వంసంపై న్యాయస్థానంలో వాదనాలు వినిపించాలని కోరా రు. కొల్లేరు సమస్యపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపించడానికి ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కొల్లేరు ప్రాంత ప్రజల పొట్ట కొట్టిందని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లిన వారిలో టీడీపీ జిల్లా పార్టీ అధ్య క్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కొల్లేరు ప్రజల పరిరక్షణ సంఘం ప్రతినిధులు బలే ఏసురాజు, సైదు సత్యనారాయణ, నంబూరి శివాజీ, కొల్లి వరప్రసాద్, ఘంటసాల మహాలక్ష్మీరాజు, బీకేఎం నాని, తదితరులు ఉన్నారు.