Palasa: ఎయిరో కార్గో ద్వారా జీడి ఎగుమతి, దిగుమతులు
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:57 AM
ఇక్కడ ఏర్పాటు చేసే ఎయిర్‌పోర్టు ద్వారా ఈ అవకాశం కల్పిస్తామన్నారు. జీడి వ్యాపారులు కూడా జీడి పరిశ్రమలే కాకుండా దాని అనుబంధ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

జీడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు: రామ్మోహన్ నాయుడు
కాశీబుగ్గ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఎయిర్ కార్గో ద్వారా జీడి ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఎయిర్‌పోర్టు ద్వారా ఈ అవకాశం కల్పిస్తామన్నారు. జీడి వ్యాపారులు కూడా జీడి పరిశ్రమలే కాకుండా దాని అనుబంధ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పలాస కాశీబుగ్గలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేరళ, గోవా తదిర రాష్ట్రాల్లో జీడి పండుతో ఆల్కహాల్ తయారు చేసి మరింత లబ్ధి పొందుతున్నారని, అలాగే జీడితొక్కతో రసాయనాలు తయారు చేస్తున్నారని చెప్పారు. జీడితో వచ్చిన ప్రతి వస్తువును వారు వినియోగించుకుని కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నారని, స్థానిక వ్యాపారులు ఆ దిశగా ఆలోచించాలని కోరారు. పలాస జీడి వెబ్‌సైట్ అంతర్జాతీయ స్థాయిలో కనిపించాలని సూచించారు.