Wildlife Conservation: కింగ్‌కోబ్రా గుడ్లను సంరక్షించి.. చివరకు...
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:12 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు రెవెన్యూ పరిధిలోని శంకరం అటవీ ప్రాంతంలో..
అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు రెవెన్యూ పరిధిలోని శంకరం అటవీ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు ఆదివారం 30 కింగ్‌కోబ్రా పిల్లలను విడిచిపెట్టారు. ఆ ప్రాంతంలో నెల రోజుల కిందట 30 కింగ్‌కోబ్రా గుడ్లను అటవీ శాఖాధికారులు, వైల్డ్ లైఫ్ సొసైటీ కో ఆర్డినేటర్ మూర్తి గుర్తించారు. ఆ గుడ్లకు రక్షణగా నెట్ ఏర్పాటు చేశారు. నెల రోజుల తర్వాత ఆ 30 గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడంతో.. వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అంతరించిపోతున్న జాతుల్లో కింగ్ కోబ్రా ఒకటని, వాటి రక్షణకు కృషిచేస్తున్నామని అటవీ శాఖ అధికారులు శాంతిప్రియ, దివాన్ మొహిద్దీన్ చెప్పారు.

కింగ్ కోబ్రా జాతికి చెందిన గిరి నాగు గుడ్లు అని అధికారులు తెలిపారు. ఆ పాములు గూడును ఏర్పాటు చేసుకుని, అందులో గుడ్లు పెట్టిన తర్వాత దాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతాయన్నారు. గిరిజన గ్రామాల్లోకి గిరినాగులు పలుమార్లు వచ్చినట్టు సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
వీడియోను ఇక్కడ చూడండి..