Share News

Liquor Scam: దేశం దాటిన ‘మద్యం’ కిరణ్‌రెడ్డి

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:11 AM

లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన కిరణ్‌ రెడ్డి అమెరికాకు తరలిపోయారు. ఆయనపై విచారణ కొనసాగిస్తున్న సిట్‌ అధికారులు, అక్రమ లిక్కర్‌ సరఫరాలో కీలక పాత్ర వహించారని భావిస్తున్నారు.

Liquor Scam: దేశం దాటిన ‘మద్యం’ కిరణ్‌రెడ్డి

అమెరికాలో ఆచూకీ పట్టిన నిఘా వర్గాలు.. గతంలోనూ అక్కడ పదేళ్లు

భార్గవ్‌తో పరిచయమూ అక్కడే.. గత హయాంలో డికార్డ్‌ పేరిట లావాదేవీలు

తిరుపతి (నేర విభాగం), ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితుడిగా భావిస్తున్న తిరుపతివాసి కిరణ్‌రెడ్డి గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. ఆయన తండ్రి రిటైర్డు ఏఎ్‌సఐ బాలసుబ్రమణ్యంరెడ్డి ఇప్పటికే సిట్‌ అధికారుల అదుపులో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమ వ్యాప్తంగా లిక్కర్‌ సరఫరాలో కిరణ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపధ్యంలో 4నెలల కిందటే అమెరికాకు చేరుకున్నట్టు తాజాగా తెలిసింది. కిరణ్‌రెడ్డి గతంలోనూ అమెరికాలో సుమారు పదేళ్లు ఉన్నారు. అక్కడ ‘ఫాస్ట్‌ సప్లై్‌స-ఫాస్ట్‌ క్లిక్‌’ పేరిట స్విగ్గీ తరహాలో ఫుడ్‌ డెలివరీ వ్యాపారాలు చేశారని తెలిసింది. రాయలసీమ వ్యాప్తంగా లిక్కర్‌ అక్రమ సరఫరాకు సహకరించాలని సజ్జల, భార్గవ్‌ కోరడంతో ఏపీకి వచ్చినట్టు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డి వద్ద కొంతకాలం పనిచేశారని భావిస్తున్నారు. డికార్డ్‌ లాజిస్టిక్స్‌ పేరిట ఓ సంస్థను రిజిస్టర్‌ చేసి దానిద్వారా మద్యం అక్రమ సరఫరా చేసినట్టు తెలిసింది. ఆ సంస్థ రిజిస్ట్రేషన్‌ సమయంలో తిరుపతి శివజ్యోతినగర్‌లోని అపార్టుమెంట్‌ చిరునామా ఇచ్చారని గుర్తించారు. వాస్తవానికి అక్కడ డెకార్డ్‌ లాజిస్టిక్స్‌ పేరిట ఎలాంటి కార్యాలయం నడవడం లేదు. సంస్థ బోర్డు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే కిరణ్‌రెడ్డిని విచారించడం అవసరమని సిట్‌ వర్గాలు భావిస్తున్నాయి.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:11 AM