Share News

కర్ణాటక మద్యం పట్టివేత

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:53 PM

కోడుమూరు ఎక్సైజ్‌ పరిధిలోని క్రిష్ణగిరిలోని ఒక క్వారీ దగ్గర డంప్‌ చేసి పెట్టిన కర్ణాటక మద్యాన్ని బుధవారం ఉదయం ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేసి పట్టుకొన్నారు.

కర్ణాటక మద్యం పట్టివేత
కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకొన్న ఎక్సైజ్‌ పోలీసులు

రూ.1.60 లక్షల మద్యం, బైక్‌ స్వాధీనం

ఒకరు అరెస్టు, పరారీలో మరొకరు

కోడుమూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): కోడుమూరు ఎక్సైజ్‌ పరిధిలోని క్రిష్ణగిరిలోని ఒక క్వారీ దగ్గర డంప్‌ చేసి పెట్టిన కర్ణాటక మద్యాన్ని బుధవారం ఉదయం ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేసి పట్టుకొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌లో సీఐ మంజుల మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు క్రిష్ణగిరిలో దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడిలో కర్ణాటకకు చెందిన 40 బ్యాక్సులో ఉన్న రూ.1.60 లక్షల విలువ గల 3840 ఒరిజినల్‌ ఛాయిస్‌ 90ఎంఎల్‌ ప్యాకెట్లను పట్టుకున్నామని తెలిపారు. కర్ణాటక మద్యాన్ని దిగుమతి చేసుకొని విక్రయిస్తున్న క్రిష్ణగిరికి చెందిన నిందితుడు లోకే్‌షను అరెస్టు చేసి అతడి నుంచి మద్యం బాక్సులు, బైక్‌ను స్వాధీనం చేసుకొన్నామన్నారు. తుగ్గలి మండలానికి చెందిన మరో నిందితుడు రాజేంద్ర పరారీలో ఉన్నాడని, త్వరలో అతడిని కూడా పట్టుకుంటామని అన్నారు. క్రిష్ణగిరి మండలంలో దేవరలు ఉండటం వలన కర్ణాటక నుంచి మద్యం దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారని సమాచారం మేరకు దాడులు చేశామని ఆమె తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ చంద్రమోహన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:53 PM