కర్ణాటక మద్యం పట్టివేత
ABN , Publish Date - Feb 01 , 2025 | 11:50 PM
కోడుమూరు ఎక్సైజ్ పరిధిలోని వెల్దుర్తి మండలం ఎల్.బండ గ్రామంలో ఎక్సైజ్ సీఐ మంజుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం దాడులు చేసి భారీగా కర్నాటక మద్యంను పట్టుకున్నారు.
కారు సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
కోడుమూరు, పిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కోడుమూరు ఎక్సైజ్ పరిధిలోని వెల్దుర్తి మండలం ఎల్.బండ గ్రామంలో ఎక్సైజ్ సీఐ మంజుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం దాడులు చేసి భారీగా కర్నాటక మద్యంను పట్టుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆమె మాట్లాడుతూ ఎల్ బండ గ్రామంలో కర్నాటక మద్యం ఉన్నట్లు సమాచారం మేరకు అక్కడికి వెళ్లి దాడులు చేయగా ఇండికా వాహనంలో 25 బాక్సుల్లో కర్నాటకకు చెందిన ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారు రూ.90వేలు ఉంటుందన్నారు. మద్యంతో పాటు కారును కూడా సీజ్ చేశామన్నారు. కర్నాటక రాష్ట్రంకు చెందిన కర్ణగౌడ్, అహమ్మద్ హుస్సేన్ అనే ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో సమగ్ర విచారణ చేపట్టి కర్నాటక మద్యం తరిలింపు వెనక ఎవరి పాత్రం ఉందో గుర్తించి వాళ్లను కూడా త్వరలోనే పట్టుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రమోహన్, లక్ష్మీ, హెడ్‌కానిస్టేబుల్ జగన్నాథం, తిరుపాలు కానిసేటబుల్స్ జగదీశ్, సాయి, భూలక్ష్మీ, సుజాత, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.