Gruhini scheme: కాపు మహిళలకు ఆర్థిక చేయూత
ABN , Publish Date - May 29 , 2025 | 05:41 AM
కాపు మహిళలకు ఆర్థిక చేయూతగా రూ.15 వేల వన్‌టైం సహాయం అందించే "గృహిణి" పథకం ప్రవేశపెట్టాలని కాపు సంక్షేమ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ఈ పథకానికి రూ.400 కోట్లు అవసరమని చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.
15 వేలు ఇచ్చేలా ‘గృహిణి’ పథకం.. కాపు కార్పొరేషన్ ప్రతిపాదన
అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు గృహిణి అనే పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడించారు. ఈ పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కసారి (వన్‌టైం) కింద రూ.15 వేలు అందించాలని కార్పొరేషన్ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 400 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలను బుధవారం తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సుబ్బారాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమానికి రూ.4,600 కోట్లు కేటాయించిందని, ఏడాదిలో వాటి ఫలితాలు చూపిస్తామని తెలిపారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News