వైభవంగా కల్యాణోత్సవం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:00 AM
స్థానిక మా ర్కెండేయస్వామి ఆలయంలో శ్రీభద్రావతి, భావనా రుషీంద్రుల 59వ కల్యాణోత్సవాన్ని పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అంగ రంగవైభవంగా నిర్వహించారు.

ధర్మవరం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): స్థానిక మా ర్కెండేయస్వామి ఆలయంలో శ్రీభద్రావతి, భావనా రుషీంద్రుల 59వ కల్యాణోత్సవాన్ని పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అంగ రంగవైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలం కరించి పూజలు చేశారు. అనంతరం అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భద్రావతి భావనా రుషీంద్రుల కల్యాణోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు హాజరయ్యారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శనివారం వసంతోత్సవ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు పుత్తారుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింకా నాగభూషణ తెలిపారు.