Share News

Excise Police: ఎక్సైజ్‌ కేసులో కాకాణికి ముగిసిన పోలీసు కస్టడీ

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:35 AM

మద్యం షాపు నుంచి అక్రమంగా లిక్కర్‌ తరలింపు కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి రెండ్రోజుల క్సైజ్‌ పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది.

 Excise Police: ఎక్సైజ్‌ కేసులో కాకాణికి ముగిసిన పోలీసు కస్టడీ

నెల్లూరు (క్రైం), జూలై 22 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపు నుంచి అక్రమంగా లిక్కర్‌ తరలింపు కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి రెండ్రోజుల క్సైజ్‌ పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ పోలీసులు సోమవారం ఆయన్ను కస్టడీకి తీసుకుని మొత్తం 62 ప్రశ్నలు అడగ్గా ఒక్క ప్రశ్నకు కూడా ఆయన స్పష్టంగా చెప్పలేదని తెలిసింది. అన్నిటికీ నాకు తెలియదు, సంబంధం లేదనే ఆయన చెప్పినట్లు సమాచారం. కస్టడీ ముగిసిన తర్వాత గూడూరు కోర్టులో కాకాణిని ఎక్సైజ్‌ పోలీసులు హాజరు పరిచి అక్కడి నుంచి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 23 , 2025 | 03:39 AM