Share News

Kakinada court: పోక్సో కేసులో ముద్దాయికి 30 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:34 AM

అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు బాలికలను ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తికి 30 ఏళ్ల జైలు శిక్ష,

Kakinada court: పోక్సో కేసులో ముద్దాయికి 30 ఏళ్ల జైలు శిక్ష

కాకినాడ పోక్సో కోర్టు స్పెషల్‌ జడ్జి సంచలన తీర్పు

పిఠాపురం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు బాలికలను ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తికి 30 ఏళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు స్పెషల్‌ జడ్జి కె.శ్రీదేవి మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. బాధిత బాలికలకు రూ.2లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన అక్కాచెల్లెళ్లను అదే ప్రాంతానికి చెందిన భగవతి హేమంత్‌ కుమార్‌ పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో నమ్మించి మోసగించాడు. ఒకరికి తెలియకుండా మరొకరిపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలికల తండ్రి ఫిర్యాదు మేరకు 2019లో అప్పటి పిఠాపురం పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో హేమంత్‌కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి మంగళవారం తుది తీర్పు చెప్పారు.

Updated Date - Jan 08 , 2025 | 04:42 AM