Share News

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ABN , Publish Date - May 20 , 2025 | 11:22 PM

మండల కేంద్రమైన పెనగలూరుకు చెందిన వైసీపీ నాయకులు గణపతిరెడ్డి రంగారెడ్డి మంగళవారం టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
టీడీపీ కండువా వేసుకున్న రంగారెడ్డి తదితరులు

పెనగలూరు, మే 20 (ఆంధ్రజ్యోతి) :మండల కేంద్రమైన పెనగలూరుకు చెందిన వైసీపీ నాయకులు గణపతిరెడ్డి రంగారెడ్డి మంగళవారం టీడీపీలో చేరారు. మంగళవారం కోడూరులో జరిగిన మినీ మహానాడు సమావేశంలో రంగారెడ్డి తన అనుచరులతో టీడీపీ కండువా వేసుకున్నారు. కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి టీడీపీ కండువా కప్పి అభినందించారు. కాగా రంగారెడ్డి, ఆయన సతీమణి మల్లీశ్వరమ్మ గతంలో టీడీపీ మండల అధ్యక్షులుగా, పెంచలకోన దేవస్థానం ధర్మకర్తలుగా రెండేసిమార్లు పనిచేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీలో చేరారు. పెనగలూరు మాజీ ఎంపీటీసీ కలివెల గంగాధరమ్మ, మాజీ ఆర్టీసీ డ్రైవర్‌ సింగనమల సుధాకర్‌, ఓబిలి నీటిసంఘం అధ్యక్షులు దుర్గయ్య, పెనగలూరుకు చెందిన కొత్త రాధాకృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:23 PM