యోగా వల్ల వ్యాధులు నయం చేసుకోవచ్చు
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:17 PM
యోగా వల్ల వ్యాధులు నయం చేసుకోవచ్చు అని ఆయుష్ డిపార్టుమెంట్ రాజంపేట బృందం యూనియన మెడిసిన డాక్టర్ కె.జవహర్‌జాన, యోగా శిక్షకులు కె.ప్రసన్న అన్నారు.
రాజంపేట, జూన 11 (ఆంధ్రజ్యోతి): యోగా వల్ల వ్యాధులు నయం చేసుకోవచ్చు అని ఆయుష్ డిపార్టుమెంట్ రాజంపేట బృందం యూనియన మెడిసిన డాక్టర్ కె.జవహర్‌జాన, యోగా శిక్షకులు కె.ప్రసన్న అన్నారు. బుధవారం స్థానిక అన్నమాచార్య ఫార్మసి కళాశాలలో నిర్వహించిన యోగాలో వారు పాల్గొన్నారు. అధ్యాపకులకు, విద్యార్థులకు పలురకాల ఆసనాలు వేయించారు. వాటి శిక్షణకు సూచనలు అందజేసి ఏయే ఆసనం చేస్తే ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉంటాయో వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఎస్‌ఎ్‌సఎస్ కార్యక్రమ అదికారి వై.ప్రదీ్‌పకుమార్, ఇతర అధ్యాపక, ఎస్‌ఎ్‌సఎస్ యూనిట్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ఫార్మసీ విద్యార్థులు పాల్గొనడంతో కళాశాల యాజమాన్యం కార్యదర్శి డాక్టర్ చొప్పా గంగిరెడ్డి, కోశాధికారి చొప్పా అభిషేక్‌రెడ్డి, వైస్ ఛైర్మన చొప్పా ఎల్లారెడ్డి, ఛైర్మన డాక్టర్ సి.రామచంద్రారెడ్డిలు అభినందించారు.