మసిపూసి మారేడు కాయచేసిన వైసీపీ
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:10 PM
పాపాఘ్ని నదిపై హైలెవల్ వంతెన నిర్మా ణం చేపడతామని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలన్నీ నీటిపై రాతలుగానే మిగిలి పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతి పనినీ మసిపూసి మారేడు కాయ చేస్తుందే తప్ప ప్రజల బాగోగులు చూసుకోలేదని విమర్శలున్నాయి. పాపాఘ్ని నదిపై వంతెన నిర్మాణం కోసం మూడేళ్లగా టి.సదుం, చెన్నరాయునిపల్లె, గుంటిపల్లె, రేకలగుంటిపల్లె, జంబుగానిపల్లె ప్రజలు ఎదురు చూస్తున్నారు.

పాపాఘ్నిపై వంతెన నిర్మాణం జరిగేనా?
మూడేళ్లుగా శాశ్వత వంతెన కోసం ఎదురు చూపు
నేతల హామీలు నీటిపై రాతలేనా.....
వర్షాకాలం వచ్చిందంటే భయం భయంగా గడపాల్సిందేనా...
తాత్కాలిక మరమ్మతులతోనే కాలయాపనలు...
పెద్దతిప్పసముద్రం మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
పాపాఘ్ని నదిపై హైలెవల్ వంతెన నిర్మా ణం చేపడతామని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలన్నీ నీటిపై రాతలుగానే మిగిలి పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతి పనినీ మసిపూసి మారేడు కాయ చేస్తుందే తప్ప ప్రజల బాగోగులు చూసుకోలేదని విమర్శలున్నాయి. పాపాఘ్ని నదిపై వంతెన నిర్మాణం కోసం మూడేళ్లగా టి.సదుం, చెన్నరాయునిపల్లె, గుంటిపల్లె, రేకలగుంటిపల్లె, జంబుగానిపల్లె ప్రజలు ఎదురు చూస్తున్నారు. పాపాఘ్ని నదిపై హైలెవల్ వంతెన నిర్మాణం చేపడతామని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు నీటిపై రాతలుగానే మిగిలి పోతున్నాయి. బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాలకు ఈ గ్రామాల ప్రజలు వెళ్లాలంటే ఈ వంతెన ద్వారానే వెళ్లాలి. గతంలో భారీ వర్షాలకు వంతెన పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇక్కడ హైలెవెల్ వంతెన నిర్మించాలని, ఇందుకు సుమారు రూ. 7కోట్లు ఖర్చవుతుందని, ఈ నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రజలను నమ్మించింది.
బొంతవారిపల్లె వద్ద తాత్కాలిక మరమ్మతులు చేసినా తిరిగి తెగిపోయిన దృశ్యం
ప్రస్తు తానికి తాత్కాలికంగా వంతెనపై సిమెంట్ దిమ్మెలను అమర్చి దానిపై మట్టిని తోలి రాక పోకలు సాగించారు. మసిపూసి మారేడు కాయను చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను మాయ చేసిందని చెప్పవచ్చు. ప్రజలకు ఆ మాయ వీడేందుకు ఎక్కువ కాలం పట్టలేదని పిస్తోంది. వివరాల్లోకెళితే....
కర్ణాటక రాష్ట్రం, మండల సరిహద్దు సమీపంలోని టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లె వద్ద చేలూరు - బి.కొత్తకోట మధ్య ప్రధాన రహదారి పాపాఘ్ని నదిపై ఉంది. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు, పెద్దలు అనే క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండల ప్రజలు వెళ్లాలం టే ఈ వంతెన గుండానే వెళ్లాలి. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఈ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామాల ప్రజ లు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక్కడ హైలెవల్ వంతెన నిర్మించాలని, ఇందుకు నిధులు మంజూరు చేసినట్లు వైసీపీ ప్రభు త్వం ప్రజలను నమ్మించింది. శాశ్వత వంతెన నిర్మాణానికి ఆలస్యం అవుతుందని ప్రస్తుతాని కి తాత్కాలికంగా నిర్మిస్తామని లోకల్ నేతలతో వంతెనపైన సిమెంట్ దిమ్మెలను అమ ర్చి తాత్కాలికంగా మట్టిని తోలి రహదారిపై రాకపోకలు జరిగేలా చేయించారు.
అయితే మళ్లీ ఏడాదికే భారీ వర్షాలు కురవడంతో తాత్కాలిక వంతెన కాస్తా పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రజాప్రతినిధులు మళ్లీ తాత్కాలికంగా చేపట్టారేతప్ప శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదు.
అధికారులకు విన్నవించినా....
ఈ వంతెన నిర్మాణంపై అధికారులకు మూడేళ్లుగా విన్నవించుకుంటూనే ఉన్నా ప్ర యోజనం లేదని టి.సదుం ప్రజలు వాపోతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకొంటున్నారే తప్ప శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టడంలో నిర్ల క్ష్యం వహిస్తున్నారు. పాపాఘ్ని నదిపై ఉన్న ఈ వంతెన తెగిపోతే ఇటు బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రానికి, అటు కర్ణాటక రాష్ట్రం చేలూరుకు వెళ్లాలన్నా సుమారు 25 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి.
బొంతవారిపల్లెకు తప్పని తిప్పలు
రంగసముద్రం గ్రామం బొంతవారిపల్లె సమీప వంతెన రంగసముద్రం పెద్దచెరువు మొర వ నీళ్లు వెళ్లే దారిలో ఉన్న వంతెన వైసీపీ ప్ర భుత్వంలో పూర్తిగా తెగిపోయింది. దీంతో బొంతవారిపల్లె నెటవరాయునిపల్లె, మలిగివారిపల్లె గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దీంతో ప్రజలు శాశ్వత పరిష్కారం చేపట్టాల ని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే నిర్మాణాలు చేపడతామని అధికారులు చెబుతున్నా ఆ సమస్య నేటికీ పరిష్కారం కాలేదు.
కూటమి ప్రభుత్వమైనా...
వర్షాకాలం కురిసిందంటే పాపాఘ్ని నదిపై ఉన్న కల్వర్టుపై ప్రయాణించాలంటే భయం భయంగా గడపాల్సి వస్తోంది. అధికంగా వర్షా లు వచ్చాయంటే కల్వర్టు తెగిపోవడం ఖాయం. పాపాఘ్నిపై కల్వర్టు తెగిపోతే మండల కేంద్రానికి వెళ్లేందుకు సుమారు 35 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. కనీసం ఈ కూటమి ప్రభుత్వంలోనైనా పాపాఘ్ని నదిపై శాశ్వతంగా కల్వర్టు నిర్మించి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం
సి. ఆంజనేయులు చెన్నరాయునిపల్లె వాసి
నిధులు మంజూరయ్యాయి
పాపాఘ్ని నదిపై ఉన్న కల్వర్టు నిర్మాణానికి రూ. 7 కోట్లు నిధులైతే మంజూ రయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆ కల్వర్టు నిర్మా ణం చేపట్టేందుకు కాంగ్రాక్టర్లు మందుకు రాకపోవడంతో పనులు చేపట్టలేక పోయాం. ఈ ప్రభుత్వంలో కల్వర్టు నిర్మాణం పూర్తి చేస్తాం. బొంతవారిపల్లె సమీపంలో ఉన్న కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చాం నిధులు మంజూరైతే పనులను పూర్తి చేస్తాం
శ్రీనివాసులు ఆర్‌అండ్‌బీ అధికారి