Share News

మహిళల ఆరోగ్యమే కుటుంబానికి శ్రీరామరక్ష

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:56 PM

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు.

మహిళల ఆరోగ్యమే  కుటుంబానికి శ్రీరామరక్ష
కార్యక్రమంలో మాట్లాడుతున్న సర్పంచ జయమ్మ

బద్వేలు రూరల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. మండల పరిఽధిలోని రాజుపాలెం గ్రామంలోని విలేజీ క్లినిక్‌లో సోమవారం స్వస్త నారీ స్వశక్తి పరివార్‌ అబియన వైద్యశిబిరాన్ని సర్పంచ రమాదేవి, డాక్టర్‌ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టరు మాట్లాడుతూ క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదని, ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో సీహెచవో చంద్రారెడ్డి, సూపర్‌వైజరు వెంకటమ్మ, వైద్యసిబ్బంది జనార్ధనరావు, రాధా, శాంతి పాల్గొన్నారు.

కాశినాయనలో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వస్థ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రఽశాంతి, స్థానిక సర్పంచ జయమ్మ పేర్కొన్నారు. సోమవారం రంపాడు పంచాయతీలోని ఓబుళాపురం ఆయుష్‌మాన ఆరోగ్య మం దిరంలో మహిళలకు హెచబీ, ఆర్‌బీఎస్‌, బీపీ, క్యాన్సర్‌, షుగరు తదితర పరీక్షలు నిర్వహించారు. అనం తరం గర్భిణులకు పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటక్రిష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రాజారెడ్డి సీహెచవో నిర్మల, పీహెచఎన శారద, హెచఎస్‌ హుస్సేనమ్మ, చంధ్రశేఖర్‌, సీహెచవో శ్రీనాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:56 PM