Share News

వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గంలో మహిళలకు చోటు

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:19 PM

వ్యవసాయ కార్మిక కార్యవర్గంలో మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి తెలిపారు.

వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గంలో మహిళలకు చోటు
ఎన్నికైన మహిళలకు కండువాలు వేస్తున్న మణి

రైల్వేకోడూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కార్మిక కార్యవర్గంలో మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి తెలిపారు. శనివారం రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట యానాదిపల్లె అరుందతివాడలో వ్యవసాయ కార్మిక మహిళా నూతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 15 వేల ఎకరాలను వందలాది మంది నిరుపేదలకు పంపిణీ చేశామన్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షురాలిగా శారదమ్మ, ఉపాధ్యక్షురాలిగా నగిరిపాటి కీర్తి, నగిరిపాటి ప్రవళ్లిక, అచ్చమ్మ, కోశాధికారిగా నగిరిపాటి రేణుక వీరితో పాటు సభ్యులుగా 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 11:19 PM