Share News

రోడ్ల దుస్థితి మారేదెన్నడో..?

ABN , Publish Date - May 04 , 2025 | 11:22 PM

ప్రొద్దుటూ రు మున్సిపాలిటీలో రోడ్ల దుస్ధితి దారుణంగా ఉంది.

రోడ్ల దుస్థితి మారేదెన్నడో..?
పైపు లైను గుంతలతో అధ్వానంగా ఉన్న బొల్లవరం - రామేశ్వరం లింకు రోడ్డు

రెండేళ్ల క్రితం పైపులైను తవ్వకాలు

విస్తరణ పేరిట వాయిదాపడ్డ

రోడ్ల నిర్మాణం

పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు,

పాలకమండలి

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రొద్దుటూరు, మే 4 (ఆంధ్రజ్యోతి) : ప్రొద్దుటూ రు మున్సిపాలిటీలో రోడ్ల దుస్ధితి దారుణంగా ఉంది. పైప్‌ లైను కోసం తవ్విన గుంతలతో రోడ్లు దుర్బరంగా మారాయి. పైప్‌లైను గుంతలకు ప్యాచ వర్కులు చేయకుండా కొత్త రోడ్లు వేయా లని చెప్పి ఏళ్ల తరబడి వాటిని అలాగే ఉంచడం తో ప్రజలు ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్ల క్రితం తాగునీటి సరఫరాలో సూపర్‌బజార్‌వీధి, బుర సాధుమఠం, రుషి అపార్ట్‌ మెంట్‌ ఏరియా, బా పూజీనగర్‌ ప్రాంతాలకు ఇబ్బందులు ఉండటం తో బొల్లవరంలోని తాగునీటి రిజర్వాయర్ల నుంచి పైపులైను అనుసంధాన పనులను మున్సిపాలిటీ చేపట్టింది. ఆయాప్రాంతాలకు తాగునీటి సమస్య తీరినా పైపులైను కోసం తీసిన గోతులకు ప్యాచ వర్కులు చేయకపోవడంతో బొల్లవరం - రామేశ్వ రం లింకు రోడ్డు దారుణంగా తయారైంది.

విస్తరణ పేరిట రోడ్డు నిర్మాణం వాయిదా

బొల్లవరం - రామేశ్వరం లింకు రోడ్డును 60 అడు గుల మేర మాస్టర్‌ ప్లాన రోడ్డు విస్తరించే పను లు చేపట్టాలని పాలక మండలి ప్రయత్నించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో గతం లో పైప్‌లైను కోసం తవ్విన గుంతలకు సైతం ప్యాచ వర్కులు చేయకుండా విస్తరణ పనులు పూర్తయ్యాక చేపడతామని అనుకోవడంతో రెండే ళ్లకు పైబడి జాప్యం జరిగింది. మధ్యలో అసెంబ్లీ పార్లమెంటుకు ఎన్నికలురావడంతో ఆ పనులు అటకెక్కాయి.

రూ.22.18 లక్షలతో టెండర్లకు పిలిచారు

రామేశ్వరం - బొల్లవరం లింకురోడ్డును మడూరు ఛానల్‌వరకు సీసీ రోడ్డు నిర్మాణం కొరకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రెండవ విడత 15 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.22.18 లక్షల అంచనాతో టెండర్లకు పిలిచాం. మే 6 తేదీన టెం డర్లు ఖరారు చేస్తాం. టెండరు ప్రక్రియ పూర్తికా గానే రోడ్డు నిర్మాణం చేపడతాం.

-మల్లికార్జున,

మున్సిపల్‌ కమిషనర్‌ ,ప్రొద్దుటూరు

Updated Date - May 04 , 2025 | 11:23 PM