Share News

వర్షం వస్తే చాలు.. ఆ రోడ్లు చెరువులే

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:39 PM

కొద్దిపాటి వర్షం వస్తేచాలు దువ్వూ రు, రాజుపా ళెం మండలంలోని కొన్ని గ్రామాల్లోని రోడ్లు చెరు వులను తలపిస్తున్నాయి.

వర్షం వస్తే చాలు.. ఆ రోడ్లు చెరువులే
రాజుపాళెం మండలం టంగుటూరు బీసీ కాలనీలో రోడ్డు దుస్థితి

దువ్వూరు/రాజుపాళెం, జూలై 20(ఆంధ్రజ్యోతి): కొద్దిపాటి వర్షం వస్తేచాలు దువ్వూ రు, రాజుపా ళెం మండలంలోని కొన్ని గ్రామాల్లోని రోడ్లు చెరు వులను తలపిస్తున్నాయి. దువ్వూరు మండలం లోని జిల్లేళ్ల గ్రామంలో స్వల్ప వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి కుంటను తల పిస్తోంది. దీంతో గ్రామ ప్రజలు ఇక ్కట్లకు గురవుతున్నారు. కొన్నేళ్ల కిందట వేసిన సిమెంటు రోడ్డు పాడైంది. ఎందుకో ఈదారి వెంబడి గ్రావెల్‌ను తోలారు. ఇలా సిమెంటు రోడ్డు మీద గ్రావెల్‌ పరచడంతో ఇబ్బంది కలుగుతుందని గ్రామస్థులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మజను వివరణ కోరగా సిమెంటు రోడ్డు మీద గ్రావెల్‌ తోలిన మాట వాస్తవమని, ఈ విషయాన్ని అదికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రాజుపాలెం మండలంలోని అర్క టవేముల, తొండలదిన్నె, టంగుటూరు, రాజుపా లెం తదితర గ్రామాల్లో రోడ్లన్నీ తగ్గుగా ఉండడం తో వర్షాలు పడినప్పుడు నీరు నిలిచి పాదాచారు లు సైతం వెళ్లడానికి వీలులేకుండా ఉం టోంది. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తే తప్ప వాటి సమస్య పరిష్కారం కాదని ప్రజలు పేర్కొంటు న్నారు. అయితే అధికారులు మాత్రం 16వ ఆర్ధిక సంఘం నిధులు గత రెండు నెలల నుంచి పం చాయతీలోకి రాకపోవడంతో పారిశుధ్యం, మంచి నీటి సౌకర్యరానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోం దని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఈ పనులు పూర్తి చేయవచ్చ ని వారంటున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:40 PM