Share News

కార్మికులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:40 PM

ఇంజనీరింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ ఇంజనీరింగ్‌ సెక్షన్‌ గౌరవాధ్యక్షుడు విజయకుమార్‌, మున్సిపల్‌ యూనియన్‌ పట్టణ కోశాధికారి రాఘవులు పేర్కొన్నారు.

కార్మికులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి
గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ ఇంజనీరింగ్‌ సెక్షన్‌ గౌరవాధ్యక్షుడు విజయకుమార్‌, మున్సిపల్‌ యూనియన్‌ పట్టణ కోశాధికారి రాఘవులు పేర్కొన్నారు. శనివారం సీఐటీయూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పిలుపులో భాగంగా ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ పార్కులోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ కార్మికులకు జీవోనెం.15, 16 మేరకు వేతనాలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 4వ తేదీ విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ సెక్షన్‌ పట్టణాధ్యక్షుడు గంగాధర్‌రెడ్డి, కార్యదర్శి బాస్కర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేషు, కోశాధికారి శివన్న, బాలాజీ, బాబు, జాషువా ఉన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:40 PM