అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:44 PM
రాష్ట్రం లోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ద్వారా అమల య్యే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తు న్నారని బ్రహ్మంగారిమ ఠం మండల టీడీపీ అధ్యక్షు డు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
బ్రహ్మంగారిమఠం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ద్వారా అమల య్యే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తు న్నారని బ్రహ్మంగారిమ ఠం మండల టీడీపీ అధ్యక్షు డు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని సోమిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ప్రజలకు అమలు చేసిన పథకాల గురించి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రా లు అందించి వివరించారు. అలాగే బి.మఠం మండ లాన్ని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దడమే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ లక్ష్యమని సుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సోమిరెడ్డిపల్లె టీడీపీ ఇనచార్జి సాంబశివారెడ్డి, పూజా శివాయాదవ్, రమణయ్య, సన్నపూరి శ్రీను, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.