Share News

గృహ నిర్మాణాలు చేపట్టని ఇళ్లు రద్దు చేస్తాం

ABN , Publish Date - May 24 , 2025 | 12:04 AM

ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజనలో భాగంగా ఇళ్లు మంజూరైనవారు వాటిని ఇంకా నిర్మించుకోనట్లయితే వాటిని తక్షణమే తొలగించి మరొకరికి మంజూరు చేయడం జరుగుతుందని హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజారత్నం పేర్కొన్నారు.

గృహ నిర్మాణాలు చేపట్టని ఇళ్లు రద్దు చేస్తాం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న హౌసింగ్‌ పీడీ

బద్వేలు ,మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజనలో భాగంగా ఇళ్లు మంజూరైనవారు వాటిని ఇంకా నిర్మించుకోనట్లయితే వాటిని తక్షణమే తొలగించి మరొకరికి మంజూరు చేయడం జరుగుతుందని హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజారత్నం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పీఎంఎవై -1 కింద గృహాలు మంజూరు అయిన వారు ప్రభుత్వం అందించేసహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు వారికి మరొకసారి ఈ అంశంపై తెలియజేయాలని సూచించారు. అప్పటికీ ఆసక్తి చూపని వారి గృహాలను రద్దు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని వారికి వివరించాలని పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మన్సిపల్‌ కమిషనర్‌ వీవీ నరసింహారెడ్డి, హౌసింగ్‌ డీఈఈ ప్రతాప్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, అమెనిటీలు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:04 AM