టమోటా కోసం చెరువులో నీరు వృఽథా
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:55 PM
చెరువు భూమిని ఆక్రమించి అందులో సాగు చేసిన టమోట సాగును రక్షించుకునేందుకు చెరువు తూమును తొలగించి నీటిని వదిలేసినట్లు రెవెన్యూ అధి కారులకు ఫిర్యాదు అందింది.

నీటిని బయటికి పంపేందుకు తీసిన కాల్వ
కలికిరి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): చెరువు భూమిని ఆక్రమించి అందులో సాగు చేసిన టమోట సాగును రక్షించుకునేందుకు చెరువు తూమును తొలగించి నీటిని వదిలేసినట్లు రెవెన్యూ అధి కారులకు ఫిర్యాదు అందింది. ఎగువ ఆవులకుంట చెరువు భూ మిని ఆక్రమించిన ఒకరు టమోట పంట సాగు చేశాడు. ఇటీవ ల కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు చేరింది. ఈ నీరు నిల్వ వుంటే తన పంట పాడైపోతుందని ఆక్రమణదారుడు ఏకంగా చెరువు తూమును తొలగించి నీటిని బయటకు పంపేశాడు. ప్రొక్లైనర్‌తో తూము నుంచి కాల్వ తీసి మొత్తం నీటిని ఖాళీ చేయించాడు. దీంతో పలువురు ఆయకట్టు రైతులు మాట్లాడు తూ అధికారులు వెంటనే చెరువును పరిశీలించి మరమ్మతులు చేయించి ఆక్రమణ దారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అక్రమంగా తీసిన కాల్వలను పూడ్చేయాలని కోరారు. స్థానిక టీడీపీ నేత వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దారుకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.