ట్యాంకర్లతో నీటి సరఫరా
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:43 PM
మండల పరిధిలోని రామచంద్రాయపల్లె గ్రామంలో ఆదివారం ట్యాంకర్లతో అధికారు లు నీటిని సరఫరా చేశారు.
మైలవరం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని రామచంద్రాయపల్లె గ్రామంలో ఆదివారం ట్యాంకర్లతో అధికారు లు నీటిని సరఫరా చేశారు. గత కొన్ని రోజులుగా రామచంద్రాయపల్లె గ్రామంలో నీటి సమస్య ఉండడం, గ్రామంలో ఎంతకు పరిష్కారం కాకపోవడంతో టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డికి గ్రామస్థులు విషయం తెలుపడంతో ఆయన అధికారులతో మా ట్లాడి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో అధి కారులు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు.