Share News

ఎరువుల షాపుల్లో విజిలెన్స దాడులు

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:13 AM

ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తప్పవంటూ రాష్ట్ర ప్రభు త్వం హెచ్చరించడంతో ఎరువుల దుకాణాలపై విజిలెన్స దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఎరువుల షాపుల్లో విజిలెన్స దాడులు
చాపాడులో యూరియా బస్తాలను పరిశీలిస్తున్న ఏవో దేవీ పద్మలత

కొరత సృష్టించినా, అక్రమ నిల్వలు ఉంచినా వేటు తప్పదంటున్న అధికారులు రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలిగించవద్దంటూ ఆదేశాలు

దువ్వూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తప్పవంటూ రాష్ట్ర ప్రభు త్వం హెచ్చరించడంతో ఎరువుల దుకాణాలపై విజిలెన్స దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మండలంలోని దువ్వూరు, చింతకుంట, కానగూడూరు గ్రామాల్లో సోమవారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ ఎస్పీ జి.శ్రీనివాసరావు, సీఐ ఎం.శివన్నతోపాటు మైదుకూరు ఏడీఏ క్రిష్ణమూర్తి, ఏవో అమర్‌నాధ్‌రెడ్డి ఎరువు ల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. మొదట దువ్వూరులోని రసాయనిక ఎరువులు విక్రయించే అంగళ్లలోకి వెళ్లి నిలువలను పరిశీలించారు. అనంతరం కానగూడూరులో సోదాలు చేసి క్రయ విక్రయాల గురించి అంగళ్ల యజమానులతో మాట్లాడారు. తదనంతరం చింతకుంటలో కేఎన్‌ఆర్‌ ఎరువుల అంగడిలో తనిఖీ చేయగా బస్తాల్లో తేడాలను గమనించి అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయించినట్లు ఏడీఏ క్రిష్ణమూర్తి తెలిపారు. అనంతరం విజిలెన్స్‌ సీఐ శివన్న మాట్లాడుతూ జిల్లాలో 3,200 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. యూరియా బస్తారేటు రూ.266.50 పైసలకే విక్రయించాలని, అధిక ధరలకుు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రసాయనిక ఎరువుల విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

ముద్దనూరులో:మండలంలోని ఎరువుల దుకాణాలను సోమవారం వ్యవసాయశాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ రామ్మోహన్‌రెడ్డి, సీఐ దస్తగిరి ఎరువుల దుకాణలలోని ఎరువులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. స్టాక్‌ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు, రైతులు కొన్న ప్రతి ఎరువుకు బిల్లులు ఇవ్వాలన్నారు. దుకాణాల్లోని గోడౌన్‌లో ఎరువులను పరిశీలించారు. ఏవో వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

చాపాడులో: ప్రైవేటు దుకాణ యజమానులుయూరియాను రైతులకు ఎక్కువ రేటుకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారిణి దేవీపద్మలత హెచ్చరించారు. చాపాడులోని రసాయనిక ఎరువులు, పురుగు మందులదుకాణాలను సోమవారం ఆమె తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు రైతులకు 707 టన్నుల యూరియాను విక్రయించామని ఇంకా 34 టన్నుల యూరియా సిద్ధంగా ఉందన్నారు. ఒక బస్తా యూరియా రూ.266.50 కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. డీఏపీ కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ప్రస్తుతం రసాయనిక ఎరువులను సిద్ధంగా ఉంచామన్నారు.

ఖాజీపేటలో: మండల పరిధిలో యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పని విజిలెన్స్‌ అధికారి ఆర్‌వీఈవో శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఖాజీపేట ఫెర్టిలైజర్స్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైతులకు ఎరువులు అందించాలని, ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తప్పవన్నారు. నానో యూరియా కూడా రైతులకు అంబాటులో ఉందని, పురుగు మందులతోపాటు నానో యూరియాను స్ర్పే చేసుకోవచ్చన్నారు. ఈ తనిఖీల్లో సీఐ మోహన్‌, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగఅర్చన, విజిలెన్స్‌ డీసీపీవో గీతావాణి, కడప సీఐ రామక్రిష్ణ, పాల్గొన్నారు.

బద్వేలులో: బద్వేలు, గోపవరం మండలాల ఎరు వుల దుకాణాలను సోమవారం విజిలెన్స అదికా రులు, సీఐ లింగప్ప ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎవరైనా నిర్ణయించిన ధరకు మించి ఎక్కువ అమ్మినా దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరిం చారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్య లు తప్పవన్నారు. ఎప్పటి కప్పుడు దుకాణాలను తనిఖీ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకుడు వెంకటసుబ్బ య్య, వ్యవసాయాధికారి విజయరావు, బద్వేలు మండల వ్యవసాయాధికారి అరుణ, వ్యవసాయ విస్తరణాదికారి ఓబయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:13 AM