Share News

పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:34 PM

గేదెలు, బర్రెలు, మేకలకు వైద్యం అందించడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలని మాచుపల్లె వెటర్నరి వైద్యాధికారి విజయరాజు సూచించారు.

పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ విజయరాజు

సిద్దవటం, జూన 27 (ఆంధ్రజ్యోతి) : గేదెలు, బర్రెలు, మేకలకు వైద్యం అందించడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలని మాచుపల్లె వెటర్నరి వైద్యాధికారి విజయరాజు సూచించారు. మండలంలోని మాచుపల్లె పశువైద్యశాలలో జ్యోతి, టక్కోలి, వంతాటిపల్లె గ్రామాలకు చెందిన పశువైద్య సిబ్బందితో ఆయన శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 26 నుంచి జూలై 10 వరకు నట్టల నివారణకు క్యాక్రమం జరుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెటర్నరి వైద్య సిబ్బంది జిలానిబాషా, భారతి, మహబూబ్‌బాసా, గోపాలమిత్ర, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:34 PM