Share News

వైభవంగా వేణుగోపాలుడి కల్యాణోత్సవం

ABN , Publish Date - May 02 , 2025 | 11:35 PM

పెనగలూరులో వెలసిన వేణుగోపాలస్వామి దేవాలయంలోని నూతన కల్యాణ మండపంలో గురువారం రాత్రి రుక్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాలస్వామి కల్యాణం వైభవంగా జరిగింది.

వైభవంగా వేణుగోపాలుడి కల్యాణోత్సవం
గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారు

పెనగలూరు, మే 2 (ఆంధ్రజ్యోతి) : పెనగలూరులో వెలసిన వేణుగోపాలస్వామి దేవాలయంలోని నూతన కల్యాణ మండపంలో గురువారం రాత్రి రుక్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాలస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. గ్రామంలోని ముదిరాజ్‌ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రూ.15 లక్షలతో గ్రామంలోని ముదిరాజ్‌ సంఘం సభ్యులు కల్యాణ మండపం ని ర్వహించారు. అమెరికాలో స్థిరపడిన కమ్మ సంఘంలోని ఓ భక్తుడు వరు డు, వధువు గదులను నిర్మించారు. రూ.15 లక్షల విరాళంతో ఉపసర్పంచ డి.చిన్నవెంగళరెడ్డి కల్యాణ మండపం చుట్టూ ప్రహరీ నిర్మించారు. కల్యాణోత్సవం తర్వాత భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. అనంతరం నూతన మండపంలో హరికథాగానం జరిగింది. గరుడ వాహనంపై రుక్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాలుడు భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - May 02 , 2025 | 11:35 PM