Share News

వెలగని విద్యుత దీపాలు.. ఇబ్బందుల్లో ప్రజలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:48 PM

ఇటీవల పూర్తయిన ముద్దనూరు-తాడి పత్రి నేషనల్‌ హైవే-67 పై ఏర్పాటు చేసిన విద్యుతదీపాలు వెలగకపోవ డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.

వెలగని విద్యుత దీపాలు.. ఇబ్బందుల్లో ప్రజలు
కొండాపురంలో హైవేపై రాత్రిపూట వెలగని విద్యుత దీపాలు

కొండాపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఇటీవల పూర్తయిన ముద్దనూరు-తాడి పత్రి నేషనల్‌ హైవే-67 పై ఏర్పాటు చేసిన విద్యుతదీపాలు వెలగకపోవ డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. హైవేపై కొండాపురం పట్టణంలో రోడ్డుకు ఇరువైపుల ఏ ర్పాటుచేసిన విద్యుతలైట్లు అంకార ప్రాయంగా ఉన్నాయి. విద్యుతలైట్లు వెల గకపోవడంతో రాత్రిపూట ప్రజలు అటుఇటూ రోడ్డు దాటుకునేటప్పుడు ఇబ్బందిపడుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. టోల్‌గేట్‌ ఏర్పాటుచేసి నెలనుంచి టోల్‌ ఫీజు వసూలు చేస్తున్న ఇంతవరకు లైట్లు వెలగకపోవడంపై స్థానికలు మండిప డుతున్నారు.ఈ లైట్లకు సంబంధించి ఇంతవరకు విద్యుతట్రాన్సఫార్మర్‌ కూడా ఏర్పాటు చేయలేదని సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు తెలిపారు. వెంట నే విద్యతలైట్లు వెలగకపోతే స్థానికులతో కలిసి ఆందోళన చేపడతామన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 11:48 PM