‘టీఎనటీయూసీ’ నూతన అసోసియేషన ఏర్పాటు
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:39 PM
టీఎనటీయూసీ కార్మిక పరిషత రాయచోటి డిపో నూతన అసోసియేషన ఎన్నిక మంగళవారం జరిగింది.

రాయచోటిటౌన, జూలై1(ఆంధ్రజ్యోతి): టీఎనటీయూసీ కార్మిక పరిషత రాయచోటి డిపో నూతన అసోసియేషన ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ జోనల్ సెక్రటరీ ఎం.పురుషోత్తం, జోనల్ గౌరవాధ్యక్షుడు శివారెడ్డి, కడప డిపో గౌరవాధ్యక్షుడు సుబ్బరాయుడు యాదవ్ సమక్షంలో నూతన కమిటీ 150 మంది కార్మికులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాయచోటి డిపో అధ్యక్షుడిగా విజయ్‌కుమార్, డిపో కార్యదర్శిగా ఎస్‌వై బాషా, చైర్మనగా ఏఏ జలీల్, ట్రెజరర్‌గా టీవీ సంగమయ్య, అడిషనల్ డిపో కార్యదర్శిగా కే. నాగరాజా, చీఫ్ అడ్వైజర్‌గా రాజారావు, కన్వీనర్‌గా ఎస్‌ఎస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాసిర్ అహమ్మద్, ఎం.బాలనరసింహులు, పబ్లిసిటీ సెక్రటరీగా బీ. సునీల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంకే వల్లి ఇంకా 20 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.