తిరంగార్యాలీ విజయవంతం
ABN , Publish Date - May 22 , 2025 | 11:54 PM
దువ్వూరులో గురువారం బీజేపీ ఆద్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీ విజయవంతమైంది.
దువ్వూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): దువ్వూరులో గురువారం బీజేపీ ఆద్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీ విజయవంతమైంది. నాయకులు ఆరవేటి హరిక ృష్ణ, అమ్మిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి బైకుల్లో జెండాను పట్టుకుని పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. దువ్వూరులోని ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి ప్రొద్దుటూరు దారిలో ఉన్న పెట్రోలు బంకు వరకు, అటు నుంచి పుల్లారెడ్డిపేట వరకు ర్యాలీ కొనసాగింది. భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం మూడు రోడ్ల కూడలిలో ఏర్పరచిన సమావేశంలో నాయకులు వీరజవాన్ మురళీనాయక్ సేవలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఐ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.