టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:15 PM
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
రాయచోటిటౌన, ఏప్రిల్29(ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాయచోటి మండల పరిధిలోని సుండుపల్లె రోడ్డులో గల క స్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు ఎదురుగా నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పరిశీలించా రు. అనరంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్ల ను మంజూరు చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లపనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. టిడ్కోలో రోడ్డు పను లు, డ్రైనేజీ, విద్యుత, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో పేదలకు నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఉపాధ్యక్షులు అనుంపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ నాయకులు శివారెడ్డి, రామచంద్ర, విష్ణువర్థనరెడ్డి, దిగువ అబ్బవరం, శిబ్యాల గ్రామాల నాయకులు, హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.