యూరియా కొరత లేదు
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:59 PM
రైతుల కు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తు న్నట్లు ఏడీఏ రామమోహనరెడ్డి, ఏవో ఏవీరామాం జులరెడ్డిలు తెలిపారు.
కొండాపురం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతుల కు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తు న్నట్లు ఏడీఏ రామమోహనరెడ్డి, ఏవో ఏవీరామాం జులరెడ్డిలు తెలిపారు. స్థానిక రైతుసేవాకేంద్రంలో సిబ్బందితో వారు సోమవారం సమీక్షా సమా వేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లా డుతూ మండలంలోని లావనూరు. టి.కోడూరు. యనమలచింతల రైతుసేవాకేంద్రాలలో ఒక్కో రైతు సేవాకేంద్రంలో ఏడు మెట్రిక్‌టన్నుల యూరి యూను సోమవారం పంపిణీ చేశామన్నారు. 20.20.0.13, డీఏపీ యూరియాను రెండు, మూడు రోజుల్లో రైతుసేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోపు ఖరీఫ్‌కు సంబంధించి ఈ-పంట నమోదు పూర్తి చేయా లని తెలిపారు. రైతులకు డ్రిప్ పరికరాలను రైతు సేవాకేంద్రాల ద్వారా రిజిసే్ట్రషన చేయాలని ఏపీ ఎంఐసీ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపా రు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ మధు మల్లేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చూడాలి
ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చూడా లని సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వా న్ని కోరారు. సోమవారం తహసీల్దార్ గురప్పకు వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వా రు మాట్లాడుతూ ఒక యూరియా బస్తా రూ.250 విక్రయించాల్సి ఉండగా బ్లాక్‌మార్కెట్‌లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీ యూసీ నాయకులు మనోహర్‌బాబు, వెంకటరమ ణ, సుదర్శనరెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో యూరియా
బద్వేలు రూరల్ , సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : బద్వేలు మండల పరిధిలో రైతులకు అవసరమైన యూరియా కొరత లేకుండా సిద్ధంగా ఉంచినట్లు ఏవో అరుణ తెలిపారు. ఇప్పటికే 75 టన్నుల యూరియాను రైతులకందించి 15 టన్నుల మేర నిల్వ ఉంచామన్నారు. మరో వారంలోపు 20 టన్నుల యూరియా మండలానికి వస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని రాజుపాలెం, వీర బల్లె, అనంతరాజపురంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో రైతులకు యూరియా సరఫరా చేస్తు న్నారని అంతేకాకుండా మరో నలుగురు ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా సరఫరా చేసేందు కు సిద్ధంగా ఉంచామన్నారు.
దువ్వూరులో: ప్రస్తుతం దువ్వూరు మండలంలోని పలు దుకాణాల్లో సోమవారం 72 టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. మండలంలోని రైతు సేవా కేంద్రాలతోపాటు మనగ్రోమోర్, పలు ప్రైవేటు అంగళ్లకు యూరియా మంజూరు కావడంతో వ్యవసాయ శాఖ, పోలీసులు, దగ్గరుండి వాటి పంపిణీకి సహకరించారు. వరి, ఇతర పంటల సాగు నేపథ్యంలో రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. కొన్ని అంగళ్ల వద్ద బారులుతీరారు. మధ్యాహ్నం 12 గంటలకే పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. కొందరు రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
పోరుమామిళ్లలో : మండలంలో రైతులు సాగు చేస్తున్న పంటలకు సాగు పూర్తయ్యేంత వరకు యూరియా దాదాపు 450 టన్నులు అవసర మయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్ సీజనలో దాదాపు మండలంలో 3500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వరి దాదాపు 1400 ఎకరాల్లో సాగైంది. చెరువులకు గంగనీరు వస్తే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొక్కజొన్న దాదాపు 700 ఎకరాల్లో టేకూరుపేట ప్రాంతాల్లో రైతన్నలు సాగు చేశారు. జొన్న కూడా సాగు చేశారు. 300 ఎకరాల్లో మిను ములు, ఉద్యానవన పంటలకు సంబంధించి డివి జనులో వెయ్యి ఎకరాల మేరకు ఉల్లిని రైతులు సాగు చేశారు. 45 రోజులు ఈ పంటలు పూర్తి స్థాయిలో రైతుల చేతికి వచ్చేంతవరకు యూరి యా అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 162 టన్నులు మాత్రమే వచ్చింది. ఎక్కు వగా రైతు సేవాకేంద్రాల కంటే ప్రైవేటు ఫెర్టిలె ౖజర్స్ షాపులకు మంజూరు కావడంతో రైతులు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు సేవాకేంద్రాలకు కూడా ఎక్కువగా యూరి యా మంజూరు చేస్తే రైతులకు ఎంతో కొంత సులువుగా ఉంటుందంటున్నారు. కాగామరో రెం డు మూడురోజుల్లో 100 నుంచి 150 టన్నులు వరకు వస్తాయని అధికారులు చెబుతున్నారు
చాపాడులో: మండలంలో మొత్తం సుమారు 26 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇప్పటికి సుమారు 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. రైతులు యూరియా కోసం వెంపర్లాడుతున్నారు. ప్రభుత్వం మండలానికి 8.60 మెట్రిక్ టన్నులు మంజూరు చేసింది. ఇది ఎంతమాత్రం చాలడంలేదు. గ్రామసచివాలయాల్లో , ప్రైవేటు దుకాణాల్లో యూరియాను విక్రయిస్తున్నారు. ఎన్.ఓబాయపల్లె, పల్లవోలు, చాపాడు, చిన్నగురవలూరు, మరికొన్ని గ్రామాల రైతులకు ఒకసారి మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా చాలా మంది రైతులకు యూరియా అవసరం ఉంది. చిన్నగురవలూరు గ్రామంలో సోమవారం పోలీసుల బందోబస్తుతో అధికారులు యూరియాను పంపిణీ చేశారు. వరినాట్లు నాటిన తర్వాత పిలకలు గంట కట్టేందుకు యూరియా తప్పనిసరిగా వాడాల్సి ఉంది. మండల వ్యవసాయాధికారిణి దేవీపద్మలత మాట్లాడుతూ మండలంలో ఇప్పటికి 8.60 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం సరఫరా చేయగానే రైతులకు మళ్లీ పంపిణీ చేస్తామన్నారు.
==========================