Share News

పేదల ఆకలి తీర్చడంలో ఎంతో సంతృప్తి ఉంది

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:14 PM

పేదల ఆకలి తీర్చడంలో ఎం తో సంతృప్తి ఉందని, కోడూరు పట్టణంలో అన్న క్యాంటీన ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని రైల్వేకోడూరు ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రుపానందరెడ్డి అన్నారు.

పేదల ఆకలి తీర్చడంలో ఎంతో సంతృప్తి ఉంది
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, ముక్కా రూపానందరెడ్డి

కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి

రైల్వేకోడూరు రూరల్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చడంలో ఎం తో సంతృప్తి ఉందని, కోడూరు పట్టణంలో అన్న క్యాంటీన ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని రైల్వేకోడూరు ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రుపానందరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని చిట్వేలి రోడ్డు ప్రభుత్వ ఆ స్పత్రి వద్ద నిర్మించే అన్న క్యాంటీన స్థలంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరవ శ్రీధర్‌తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలకు కడుపు నింపడానికి క్యాంటీన నిర్వహించాలని కోరిక ఉండేదని, ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆ కోరిక తీరందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఎస్‌ చైర్మన జయప్రకాష్‌, రాష్ట్ర యువజన నాయకుడు ముక్కా వికాష్‌ రెడ్డి, మైనారిటీ నాయకులు పఠాన మౌలా (అల్లాబకాష్‌), టీడీపీ నాయకులు బత్తిన వేణుగోపాల్‌, పోతురాజు నవీన, నార్జాల హేమరాజ్‌, జనసేన నాయకుల తాతంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 11:14 PM