లోతు దుక్కులతో ఎంతో ప్రయోజనం
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:57 PM
లోతు దుక్కు లు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం, తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి.మాధురి అన్నారు.

పెనగలూరు, జూన 10 (ఆంధ్రజ్యోతి): లోతు దుక్కు లు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం, తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి.మాధురి అన్నారు. వికసిత సంకల్ప అభియానలో భాగంగా పెనగలూరులో ఏవోఎనకేవీ సుబ్రమణ్యం అధ్యక్షతన మంగళవారం కోడిచెన్నయ్యగారిపల్లె, నారాయణనెల్లూరు గ్రామాల్లో తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. వరి, నువ్వు పంటలు సాగు చేసే రైతులు వేసవిలో లోతుగా దుక్కులు దున్నుకుని ఉంటే భూమిలోపల ఉన్న క్రిములు చనిపోతాయన్నారు. దీని ఫలితంగా కాండం తొలచే పురుగులు ఏర్పడవన్నారు. ఉద్యానశాఖ శాస్త్రవేత్త డాక్టర్ మానస, కేవీకే తదితరులు పాల్గొన్నారు.