Share News

కదలిన పసుపు దళం

ABN , Publish Date - May 30 , 2025 | 12:06 AM

రాష్ట్రంలో ఎన్నడూ జరగని రీతిలో కడపలో టీడీపీ జాతీ య పండుగ మహానాడుకు లక్షలాదిగా పసు పు సైన్యం కదిలింది.

కదలిన పసుపు దళం
ప్రొద్దుటూరు నుంచి ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో తరలివెళ్లిన నాయకులు

కడపలో మహానాడు చివరి రోజు బహిరంగ సభకు బస్సులు, కార్లు, మోటారు బైకుల్లో భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

ప్రొద్దుటూరు, మే 29 (ఆంధ్రజ్యోతి) :ముఖ్యంగా జిల్లాలో సీని యర్‌ నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలు పొందిన నంద్యాల వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డిల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నుంచి 25 వేల మంది కార్యకర్తలను మహానాడుకు తరలించి జిల్లాలోనే రికార్డు సృష్టించారు. నియో జకవర్గ వ్యాప్తంగా ప్రొద్దుటూరు పట్టణం, మండలం, రాజుపాళెం మండలాల నుంచి వేలా దిగా టీడీపీ కార్యకర్తలు స్యచ్చందంగా కదలి వెళ్లారు. నియోజకవర్గం నుంచి 344 బస్సులు, వ్యాన్లు, 300 కార్లు వేలాదిగా మోటారు బైకుల ల్లో కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని జాత రలా పసుపు పండుగకు తరలివెళ్లారు. గోపవ రం పంచాయతీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ప్రతాప్‌లు, కొత్తపల్లె నుంచి సర్పంచ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, 5వ వార్డు నుంచి కౌన్సి లరు మురళీధర్‌రెడ్డి, 11,13 వార్డులనుంచి టీడీ పీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటే శ్వర్లు, 20వ వార్డు నుంచి మాజీ చైర్మన ఆసం రఘురామిరెడ్డి 12 వార్డునుంచి మాజీ చైర్మన వీఎస్‌ ముక్తియార్‌, రాజుపాళెం మండలం నుంచి మాజీ జడ్పీటీసీ తోటమహేశ్వరరెడ్డి 36వ వార్డు నుంచి మాజీ కౌన్సిల్లర్‌ సోమా బాలయ్య, 41 వార్డునుంచి గంజికుంట ఆంజినేయులు, 38 వార్డు నుంచి కౌన్సిల్లర్‌ పల్లా రమాదేవి పల్లా సురేష్‌, బీసీ నాయకుడు చల్లా రాజగోపాల్‌ యాదవ్‌ ,వైఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నాన టీచింగ్‌ స్టాప్‌ అధ్యక్షుడు రసూల్‌గౌస్‌, వంగల నారాయణ రెడ్డి , 31వ వార్డు నుంచి మార్తల గురివిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు పెద్ద ఎత్తున జనాలను తరలిం చారు. నియోజకవర్గ మాజీ ఇనచార్జ్‌ ప్రవీణ్‌రెడ్డిల ఆధ్వర్యంలో వైఎంఆర్‌కా లనీనుంచి వాహనాల్లో పెద్ద ఎత్త్తున టీడీపీ కార్య కర్తలు తరలివెళ్లారు. అలాగే టీడీపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాజీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీప్రసన్నలు కార్యకర్తల తో కలిసి మహానాడుకు వెళ్లారు.

భూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో వెళ్లిన నేతలు

జమ్మలమడుగు, మే 29 (ఆంధ్రజ్యోతి): కడపమహానాడు పండుగకు గురువారం ఉదయం 9 గంటల నుంచి జమ్మలమడుగు జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి ఆద్వర్యంలో భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఇందులో జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం ప్రాంతాల నుంచి సుమారు 300 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వెయ్యి స్కార్పియోలు, సుమోలు, తుఫాన్‌ వాహనాల్లో 25 వేల మంది కడప మహానాడు కు తరలి వెళ్లినట్లు టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

బద్వేలు నుంచి ..

బద్వేలు/టౌన, మే29 (ఆంధ్రజ్యోతి): కడప నడిబొడ్డున జరుగుతున్న పసుపు పండగ మహానాడు మూడవ రోజైన గురువారం బహిరంగ సభకు బద్వేలు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ , టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రితేష్‌కుమార్‌రెడ్డి, డీసీసీ బ్యాంక్‌ చైర్మన సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యక ర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాగిమా ను ప్రతాప్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు వెంగల్‌ రెడ్డి, మిత్తికాయల రమణ, రైస్‌మిల్లు ప్రసాద్‌, నాగభూషణం తదితరులు భారీ జనసమీకర ణతో మహానాడుకు తరలివెళ్లారు.

మైదుకూరు నుంచి ...

మైదుకూరు రూరల్‌ ,మే 29(ఆంధ్రజ్యోతి) : కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆద్వర్యంలో మైదుకూ రు మున్సిపాలిటీ, మండలం నుంచి టీడీపీ శ్రే ణులు భారీగా బయలుదేరి వెళ్లారు. పార్టీ పట్ట ణ అధ్యక్షుడు దాసరి బాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏపీ రవీంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ మెంబర్‌ చిన్న,ఽ దనపాల జగన్‌, క్రిష్ణయ్య, శ్రీని వాసులు, గురప్ప, భీమయ్య, మల్లిఖార్జున్‌యా దవ్‌, కిషోర్‌యాదవ్‌, కటారి క్రిష్ణ, పొలిమేర శివశంకర్‌రెడ్డిలు జనసమీకరణకు కృషి చేశారు.

Updated Date - May 30 , 2025 | 12:06 AM