రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:53 PM
రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

సంబేపల్లె, జూన10(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఖరీఫ్- 2025 సీజనకు సంబంధించి మంగళవారం సంబేపల్లె మండలంలోని నారాయణరెడ్డిగారిపల్లె రైతు సేవా కేంద్రంలో, రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన బస్తాల పంపిణీ చేపట్టారు. 30 కేజీల విత్తన బస్తా ధర రూ.2850 కాగా ప్రభుత్వం రూ. 1140 రాయితీగా ఇవ్వడంతో రతులు కేవలం రూ. 1710 చెల్లించి పొందవచ్చునన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు సులభ పద్ధతిలో తక్కువ ఖర్చుతో పంట పొలాలకు పిచికారీ చేసుకునేందుకు కిసాన డ్రోన్లను సబ్సిడీపై అందజేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ యంత్ర పరికరాల బ్యాంకుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం 80 శాతం రాయితీతో కిసాన డ్రోన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కిసాన డ్రోన్లను రైతులకు అందజేశారు. ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీ పథకాలు, ఆధునిక పరికారలు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు శ్రీలత, ఎంపీడీవో రామచంద్ర, వ్యవసాయ అధికారులు రమేశరాజు, కిశోర్‌నాయక్, మహబూబ్‌బాషా, గీత, విస్తరణ అధికారులు రెడ్డి వెంకట్రమణ, రేణుక, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.