సగిలేరు గురుకులం తరలింపును వెంటనే ఆపాలి
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:11 AM
సగిలేరు వద్ద ఉన్న సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తరలింపును వెంటనే ఆపాలని వి ద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరు తున్నారు.
పాఠశాలను తరలించేందుకు ఒప్పుకోం : విద్యార్థుల తల్లిదండ్రులు
బి.కోడూరు, జూన 27 (ఆంధ్ర జ్యోతి) : సగిలేరు వద్ద ఉన్న సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తరలింపును వెంటనే ఆపాలని వి ద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరు తున్నారు. 1992 నుంచి నడుస్తున్న సగిలేరు గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు నడుస్తున్నాయని. ఇందులో దాదాపుగా 300 మంది విద్యార్థులు విద్యన భ్యసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు వస తులు కల్పించడంతోపాటు బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు, గోపవరం, బి.కోడూ రు. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాలకు చెందిన విద్యార్థులు విద్యన భ్యసించేందుకు తోడ్పడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా బద్వేలు నియోజకవ ర్గంలో సగిలేరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఒకే ఒక్కటి. ఆ పాఠశాలను తరలిస్తే సహించేదిలేదని ప్రజలంటున్నారు.
ఇనచార్జి మినిస్టరు, కలెక్టర్‌తో మాట్లాడా: రితేష్‌కుమార్‌రెడ్డి
సగిలేరు గురుకుల పాఠశాలను తరలిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు బద్వేలు టీడీపీ ఇనచార్జి రితేష్‌కుమార్‌రెడ్డితో మొరపెట్టుకోగా, ఆయన జిల్లా ఇనచార్జి మినిస్టరు సవిత, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌తో మాట్లాడారు. వారు సాను కూలంగా స్పందించారని ఆ గురుకుల పాఠశాల అక్కడే ఉండేందుకు ఉన్నతాధికా రు లతో మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టరుతో మాట్లాడేందుకు ఆయన విజయవాడకు కూడా వెళ్లినట్లు తెలిసింది. కాగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను పక్క నియోజకవర్గానికి తరలించేందుకు ఒప్పుకోమని మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు.