సీహెచవోల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:44 PM
గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము.
రాయచోటి(కలెక్టరేట్), ఏప్రిల్3(ఆంధ్రజ్యోతి): గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీహెచవోల సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 6 సంవత్సరాలు దాటిన సీహెచవోలను క్రమబద్దీరించాలని, ఎనహెచయంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇ వ్వాలని, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటీవ్ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. ఆర్థికమైన, ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాల్‌మోహన, అహ్మద్‌బాషా, భరతకుమార్, శివకుమార్, అనిల్ పాల్గొన్నారు.