కొలువుదీరిన గణనాథులు
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:51 PM
వినాయక చవితి వేడుకలు ప్రారంభం కావడంతో మండపాలలో గణనాథులు కొలువుదీరారు.
ప్రొద్దుటూరు టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి వేడుకలు ప్రారంభం కావడంతో మండపాలలో గణనాథులు కొలువుదీరారు. ఇప్ప టికే నిర్వాహక కమిటీవారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత రెండు రోజులుగా భారీ వినాయకు లను నిర్వాహకులు మినీలారీలు, ట్రాక్టర్టలో మం డపాలకు తరలించి పూజలకు సిద్ధం చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వీధి వీధిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం నుంచి మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, 9 రోజులపాటు స్వామివారికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఉత్సవ కమిటీల నిర్వాహకులు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా కొన్ని కమిటీలు భక్తులకోసం అన్నప్రసాద వినియోగం చేయనున్నారు.
జోరుగా పూజా సామగ్రి విక్రయం
వినాయక చవితి పర్వదినం పురష్కరించుకుని పూజా సామగ్రి విక్రయాలు జోరుగా సాగాయి. మంగళవారం ఉదయం నుంచి శివాలయం సెంటర్, పాత మార్కెట్, కొర్రపాడురోడ్డు, తదితర ప్రాంతాల్లో పూజా సామగ్రి విక్రయాలతో సందడిగా మారాయి. వచ్చిన భక్తులతో కోనేటి కాలువ వీధి, శివాలయం వీధులు కిక్కిరిసిపోయాయి. పండుగను పురష్కరించుకుని అధిక ధరలకు పూజా సామగ్రిని విక్రయించారు.
బద్వేలులో : వినాయక చవితి పండుగ సందర్బంగా బద్వేలు పట్టణంలో మంగళవారం నుంచే సందడి నెలకొంది. బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా పూజా సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన జనాలతో పట్టణ ప్రాంతమంతా కిటకిటలాడింది. ముఖ్యంగా పోరుమామిళ్ల రోడ్డులోని మార్కెట్ వద్ద వినాయక విగ్రహాలతో పాటు పూజా సామగ్రి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కిక్కిరిసిపోయింది. దీంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర కృషి చేయాల్సి వచ్చింది..
బికోడూరులో: బికోడూరు మండల వ్యాప్తంగా ఉన్న 46 గ్రామాల్లో గణనాఽథుల విగ్రహాల ను ఏర్పాటు చేశారు. బద్వేలు, పోరుమామిళ్ల తయారీ కేంద్రాల నుంచి మంగళవారం గణనాధులను మండపాలలో పూజలందు కోవడానికి కొలువుదీ రారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ వెంకటసురేశ గట్టి బందోబస్తుఏర్పాటు చేశారు.
మైదుకూరు రూరల్‌లో : వినాయక చవితి పం డుగ సందర్భంగా మంగళవారం స్థానిక రాయల్ కూడలిలో పూజాసామగ్రి కొనుగోలు చేయడానికి గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. వినా యక ప్రతిమలతోపాటు పూజాసామగ్రి, వెలక్కా యలు, చెరుకు గడెలు, అరటి తోరణాలు తదితర వస్తువులను ప్రజలు కోనుగో లు చేశారు.
కాశినాయనలో: గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది. బుధవారం వినా యక చవితి ఉత్సవాల కోసం మండపాలు సిద్ధం చేశారు. పోరుమామిళ్ల పట్టణం నుంచి గణనాఽథు లు పల్లెలకు ట్రాక్టర్లల్లో తరలి పోయారు.