సంక్షేమ పథకాలు అందించడమే పభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:33 PM
సంక్షేమ పథకాలు అందించ డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ బ్యాం కు చైర్మన మంచూరి సూర్యనారాయ ణరెడ్డి తెలిపారు.
అట్లూరు, జూలై 24 (ఆంధ్రజ్యో తి): సంక్షేమ పథకాలు అందించ డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ బ్యాం కు చైర్మన మంచూరి సూర్యనారాయ ణరెడ్డి తెలిపారు. అట్లూరు మండలం లోని అట్లూరు క్రాస్ రోడ్డు ఉప్పు టూరు కాలనీలో గురువారం సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమం నిర్వ హించి సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్ర మంలో మండల టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులరెడ్డి, మండల ఇనఛార్జ్ పోతిరెడ్డి రెడ్డయ్య, సొసైటీ డైరె క్టరు పాటూరు రాధాక్రిష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, వరికుంట సర్పంచ రమణయ్య, అట్లూరు మాజీ సర్పంచ నరసింహులు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉలవపల్లెలో సుపరిపాలనలో తొలి అడుగు
పెద్దముడియం, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని ఉలవపల్లె గ్రామంలో టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం సుపరిపాలనలో తొలి అడు గు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయీ బ్రాహ్మణ కడప పార్ల మెంటు అధ్యక్షుడు గజ్జల గోవిందు తదిత రులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీఎనఎస్ ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధార్ధ రాయల్, కార్యనిర్వాహక కార్యదర్శి రామాంజనే యరెడ్డి, జమ్మలమడుగు అధ్యక్షులు మహేశ, రఘు తదితరులు పాల్గొన్నారు.